నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
రామన్నపేట, ఫిబ్రవరి 11 : భువనగిరిలో శనివారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ విజయవంతానికి గ్రామాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధర్మారెడ్డి కాల్వ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మందడి ఉదయ్‌రెడ్డి, పోచబోయిన మల్లేశం, సింగిల్‌విండో చైర్మన్ భిక్షంరెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు భువనగిరికి వెళ్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎమ్మెల్యే చిరుమర్తి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మండలంలో ఘన స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ కోరారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో విద్యార్థి, యువజన విభాగం ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించి సీఎం సభను విజయవం చేయాలని కోరారు. సీఎం సభను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, టీఆర్ఎస్ గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఒక ప్రకటనలో కోరారు. తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సభను విజయవంతం చేయాలని కోరారు. రాజాపేట మండల కేంద్రంలో యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోశ్‌గౌడ్ మాట్లాడారు. సీఎం సభను విజయవంతం చేయాలని మోటకొండూర్‌లో జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, సభ మండల ఇన్చార్జి శివాజీ కోరారు. చౌటుప్పల్‌లో సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకాలని పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలని వలిగొండ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, భువనగిరి మండలాధ్యక్షుడు జనగాం పాండు కోరారు.