తిరుమలగిరి, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని తాటిపాములలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలకు తగిన సమయంలో పదవులు వస్తాయని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తిరుమలగిరి 12వ వార్డులో గణేశ్‌ను దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిని, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, మాజీ ఎంపీపీ సతీశ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తుంగతుర్తి :మండలంలోని వెంపటి, గొట్టిపర్తి గ్రామాల నుంచి సుమారు 50 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారు ఎమ్మెల్యే గాదరి కిశోర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో వెంపటి వార్డు సభ్యుడు చిటుకుల శ్రీనివాస్, బీజేపీ మండల నాయకులు జిలుకర శ్రీనివాస్, మురళి, బాబూరావు తదితరులు ఉన్నారు. అనంతరం మండలంలోని 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, తునికి సాయిలు, దొంగరి శ్రీనివాస్, సర్పంచ్ చందా వెంకన్న, వెంపటి ఎంపీటీసీ వీరస్వామి పాల్గొన్నారు.
మద్దిరాల : మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వల్లపు రమేశ్‌యాదవ్, సీనియర్ నాయకులు కసనబోయిన వెంకన్న, రాంపాక బుచ్చయ్య టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వడ్డాణం మధుసూదన్, ఉప సర్పంచ్ మల్లాల నర్సయ్య, వెంకట్‌రెడ్డి, శివారెడ్డి, బీఎస్ ముదిరాజ్, వెంకన్న, లింగయ్య, నాగరాజు, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు రవీందర్‌యాదవ్ పాల్గొన్నారు.