భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, బొల్లేపల్లి అశోక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లా డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి బాటలు వేశారన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నానని, గతానికి భిన్నంగా నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, మౌలిక సౌకర్యాలు నూరు శాతం జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురులేదని గులాబీ ధాటికి ఏ పార్టీ నిలువబోదని జోస్యం చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలో చేరిన వారిలో సరికొండ లవకుశ, కునుకుంట్ల సుధాకర్, రమేశ్, యాదయ్య, స్వామి, కిష్టయ్య, చంద్రయ్య, బాలయ్య, భిక్షపతి, నరసింహ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జిట్ట కృష్ణారెడ్డి, రాజు, సంపత్, అంజయ్య పాల్గొన్నారు.