పెద్దవూర, ఫిబ్రవరి 7 : మండలంలోని తుంగతుర్తి గ్రామ పరిధిలోని రామన్నగూడెంలో రెండేండ్లకోసారి జరిగే ముత్యలమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే భగత్‌కుమార్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ విష్ణుప్రియాసైదులుయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పూజలు చేసి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ గుంటక వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, ఆలయ చైర్మన్ మెహన్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు సంపత్‌కుమార్, కర్ణ బ్రహ్మారెడ్డి, శ్రీకర్‌నాయక్, పీ. వెంకట్‌రెడ్డి, బాలవర్ధిరాజు, రాజేశ్‌నాయక్, మల్లికార్జున్ పాల్గొన్నారు.