తుంగతుర్తి, మే 22 : తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్కాపురి శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌండ్ల సంప్రదాయాలను దెబ్బతీస్తే ఉరుకోమని హెచ్చరించారు. ఓ వైపు కల్లుగీత కార్మికులు వృత్తిని కాపాడుకుంటూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు కార్పొరేట్ వ్యవస్థ తాటి ఫెస్టివల్ పేరుతో ఈవెంట్లు నిర్వహించి కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని చూడటం దారుణమన్నారు. కల్లు గీత సంక్షేమ సంఘం నాయకులు గుండగాని నాగరాజ్‌గౌడ్, వెలిశాల మల్లేష్‌గౌడ్, ముత్తయ్యగౌడ్, సుధాకర్‌గౌడ్, సగర్ పాల్గొన్నారు.