డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలి
ప్రతి డ్రైవర్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవడం వల్ల తాను సురక్షితంగా డ్రైవ్ చేయడమే కా కుండా, ఇతర వాహనదారుల పొరపాట్లను ముందుగానే అంచనా వేసి, ప్రమాదాలు నివారించేందుకు వీలుంటుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు.
నీలగిరి, మే 6: ప్రతి డ్రైవర్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవడం వల్ల తాను సురక్షితంగా డ్రైవ్ చేయడమే కా కుండా, ఇతర వాహనదారుల పొరపాట్లను ముందుగానే అంచనా వేసి, ప్రమాదాలు నివారించేందుకు వీలుంటుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో భారీ వాహనాల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు కార్యాలయం లో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్ పోర్టు యాజమాన్యం, డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, డ్రైవింగ్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎకువ శాతం నిర్లక్ష్యపు డ్రైవిం గ్, అధిక వేగం, అలసటగా ఉన్నా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా భారీ వాహన ప్రమాదాలు తీవ్ర నష్టా న్ని కలిగిస్తాయని, అందువల్ల డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒకరూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు కచ్చితం గా పాటించాలన్నారు. వాహనాలను ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయకూడదన్నారు. డ్రైవర్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని,ప్రయాణానికి ముం దు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలన్నారు.
వాహనాలను ఎకడ పడితే అకడ నిలపకుండా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని దవాఖానకు తరలించడం ప్రతి పౌరుడి బాధ్యతని, బాధితులను దవాఖానకు తరలించిన వారికి ‘రహవీర్’ పథకం కింద ప్రోత్సాహక నగదు బహుమతిగా మొదటి సారి రూ.25వేలు, రెండోసారి రూ.50వేలు, మూడోసారి రూ.లక్ష ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, డీటీఆర్బీ రిటైర్డ్ సీఐ అంజయ్య, మిర్యాలగూడ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాంద్పాషా, సెక్రటరీ రవీందర్రావు, డ్రైవర్లు, ట్రాన్స్పోర్టు యాజమాన్యం, పోలీసులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

