చండూరు, అక్టోబర్ 12 : ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, గుండ్రపల్లి ఉప సర్పంచ్ కాసాల వెంకట్‌రెడ్డి దంపతులు బుధవారం మంత్రి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వివిధ పార్టీల నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్, నాయకులు సిరింశెట్టి శ్రీధర్‌బాబు, పున్న ధర్మేందర్, గండూరి జనార్దన్, వహీద్ ఉన్నారు.
మునుగోడులో కాంగ్రెస్, బీజేపీకి ఎదురుదెబ్బ
నాంపల్లి : మునుగోడు లో కాంగ్రెస్, బీజేపీకు మ రో ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు మండలంలోని సోలిపురం సర్పంచ్ నకిరేకంటి పద్మ భర్త యాదయ్య, బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు నకిరేకంటి నర్సింహగౌడ్‌తో పాటు నాంపల్లికు చెందిన వార్డు సభ్యులు కోరె కిషన్ ఆధ్వర్యంలో కోరె శేఖర్, జయప్రకాశ్, మహేశ్, పెరుమాళ్ల రఘు, కోరె రాజయ్య, వెంకటేశ్ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, సైదులు గౌడ్ పాల్గొన్నారు.