దామరచర్ల, జూలై 31 : తెలంగాణ ఆవిర్భావానికి ముందు అంధకారంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి రైతులకు పూర్తి స్థాయి లో విద్యుత్తును సరఫరా చేసి, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, రాష్టం లో వెలుగు జిలుగులు నింపిన నాటి సీఎం కేసీఆర్ కల సాకారం కానున్నది. శుక్రవారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మొదటి యూనిట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముగ్గురు మంత్రులతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. బీఆర్ఎస్ హయాం లో నాటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో రూ.25 వేల కోట్ల తో ఐదు యూనిట్లతో 4వేల మెగావాట్ల పవర్ ప్లాం టుకు 2015 జూన్ 8న టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో శ్రీ కారం చేట్టా రు. కేసీఆర్ మానసపుత్రిక గా పేర్కొన్న ఈ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రభుత్వ రంగసంస్థ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించారు. అన్ని అనుమతులతో 2017 అక్టోబర్‌లో ఐదు ప్లాంట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడంతో పనులు మొదట్లో వేగంగా కొనసాగినా మధ్యలో రెండేండ్లు జాప్యం జరిగింది.
కరోనా అనంతరం పనులు వేగంగా చేపట్టడంతో రిజర్యాయర్లు, బాయిలర్లు, కూలింగ్ టవర్లు, సబ్స్టేషన్ల పనులన్నీ పూర్తయ్యాయి. దీంతో పాటు రూ.100 కోట్లతో 8 కిలోమీటర్ల పరిధిలో రైల్వేలైన్లు పనులను కూడా పూర్తి చేశారు. పవర్‌ప్లాంటు నిర్మాణ పనులను కేసీఆర్ నిత్యం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా అధికారుల మధ్య సమన్వయం చేస్తూ మూడు సార్లు పవర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. దీనితో ప్లాంటులో మొదటి, రెండో యూనిట్ల పనులు 90శాతం పూర్తి కావడంతో ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. మిగతా యూనిట్ల పనులు కూడా 70శా తం పూర్తయిన సమయంలో చెన్నై, ముంబయికి చెందిన సామాజిక వేత్తలు ఎన్జీటీలో కేసు వేయడంతో విద్యుత్తు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఇంతలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం మొదట రెండోయూనిట్ను ప్రారంభించి 800 మెగావాట్ల విద్యుత్తును ప్రారంభించింది. దీంతో పాటు నేడు (శుక్రవారం) మొదటి యూనిట్‌ను కూడా ప్రారంభించనున్నారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో ముగ్గురు మంత్రులు కలిసి ప్లాంటును ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. నాడు సీఎం కేసీఆర్ చూపిన దార్శనికత కారణంగా నేడు రాష్ర్టానికి 1600 యూనిట్ల విద్యుత్తు అందనుంది. విద్యుత్తు కొరతను అధిగమించేందుకు ఆధారం కానుంది.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే విద్యుత్తు రం గంపై ప్రత్యేక దృష్టి సారించి పవర్ ప్లాంటు ఏర్పాటుకు కృష్ణా, మూసీ నదుల తీరంలో ఉన్న దామరచర్ల మం డంలంలో యాదాద్రి వపర్ ప్లాంట్‌ను ఏర్పాటుకు శ్రీకా రం చుట్టారు. 25 వేల కోట్లతో నాలుగువేల మెగావాట్ల పవర్ ప్లాంటు ఏర్పాటుకు 2014లో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం భూసేకరణలో అనేక ఆటంకాలు ఎదురైనా వాటిని చాకచక్యంగా పరిష్కరించారు. ప్లాంటు కింద 5668 ఎకరాల భూమిని సేకరించగా, అందులో 4676 ఎకరాలు అటవీశాఖ భూమి ఉంది. ఇందులో 702 ఎకరాల్లో ఎంక్రోచర్లు సాగుచేసుకుంటున్నారు. వారికి కూడా మానవతా దృక్పథంతో ఆరు లక్షల నష్టపరిహారం అందజేశారు. ప్లాంటు కింద నష్టపోయిన రెండు తండాలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అందజేశారు. 550 మంది భూ నిర్వాసితులను గుర్తించి పరిహారం అందజేశారు.. ఆ సమయంలో కేసీఆర్ తాను కూడా భూ నిర్వాసితుడినేనని, వారి బాధలకు తనకు తెలుసంటూ ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తానని చెప్పి, అందరినీ ఒప్పించి ప్లాంటు పనులు ప్రారంభించి పనులను పూర్తిచేశారు. నాడు దార్శనికుడు శ్రీకారం చుట్టి, ప్రారంభించిన వెలుగు జిలుగుల ప్రాజె క్టు నేడు జాతికి అంకితం చేయడంతో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది.