దేవరకొండ, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుమారు 15 వేల మందితో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభకు తరలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ప్రజలతో కలిసి నిర్వహించడం అదృష్టమన్నారు. దేశంలోని 29 రాష్ర్టాల కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని గుర్తు చేశారు. సచివాలయానికి బీఆర్ అంబేదర్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరిచిపోలేమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఎస్పీ నాగేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, వంగాల ప్రతాప్‌రెడ్డి, మాధవరం సునీతాజనార్దన్రావు, నున్సావత్ పార్వతి, కొండూరి భవాని, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, పసునూరి సరస్వతి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, తూం నాగార్జున్‌రెడ్డి, వల్లపురెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్‌నాయక్, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు చరిత్రాత్మకం
తెలంగాణ సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రాత్మకమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పట్ల గౌరవాన్ని సీఎం కేసీఆర్ సగర్వంగా చాటుకున్నారన్నారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాస భాస్కర్, ముదిగొండ ఎల్లేశ్, వింజమూరి రవి, ఎర్ర విజయ్, సైదులు పాల్గొన్నారు.