e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు గురుకులాల్లో ఇంటర్‌ విద్య

గురుకులాల్లో ఇంటర్‌ విద్య

గురుకులాల్లో ఇంటర్‌ విద్య

ఉమ్మడి జిల్లాలోని 11 మైనార్టీ పాఠశాలలు కళాశాలలుగా అప్‌గ్రేడ్‌
మొత్తంగా 20కి చేరిన ఇంటర్‌ కళాశాలల సంఖ్య
విద్యార్థులకు మెరుగైన విద్యే లక్ష్యంగా అడుగులు

మహబూబ్‌నగర్‌టౌన్‌, జూన్‌16: మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 200లకుపైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలోని 121 పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11మైనార్టీ గురుకుల పాఠశాలలను ఉండడం విశేషం. 2021-22 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పించేందుకు పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలకు దీటుగా మైనార్టీ గురుకులాల్లో విద్య అందిస్తున్నారు. అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీకావడంతో పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థులకు గురుకులాల్లోనే ఉచితంగా ఇంటర్‌ విద్య కూడా అందనున్నది. దీంతో విద్యార్థులు మైనార్టీ జూనియర్‌ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9కళాశాలలు ఉండగా, మరో 11పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేయడంతో కళాశాలల సంఖ్య 20కి చేరింది.
అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలలు..
మహబూబ్‌నగర్‌ బాలుర-2,3, బాలికల 2,3, జడ్చర్ల బాలికల, దేవరకద్ర బాలుర-2, మక్తల్‌ బాలికలు, కల్వకుర్తి బాలికలు-1, నాగర్‌కర్నూల్‌ బాలురు, బాలికలు, కొల్లాపూర్‌ బాలికలు, వనపర్తి బాలికలు, అలంపూర్‌ బాలికల పాఠశాలలు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఇందులో 5 బాలుర, 6 బాలికలు కళాశాలు ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో 40 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. 5 కళాశాల్లో ఎంపీసీ, బైపీసీ, 4కళాశాలల్లో ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, 2 కళాశాల్లో ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నారు. మహబూబ్‌నగర్‌ బాలుర-3, బాలికల-2 ఒకేషనల్‌ కోర్సులు, దేవరకద్ర బాలుర-2, నాగర్‌కర్నూల్‌-బాలుర-1, వనపర్తి బాలికల-1, జడ్చర్ల బాలికల-1, మక్తల్‌ బాలికల-1లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు, మహబూబ్‌నగర్‌ బాలికల-3లో ఎంఈసీ, సీఈసీ, మహబూబ్‌నగర్‌ బాలుర-2, అలంపూర్‌ బాలికల-1, కొల్లాపూర్‌ బాలికల-హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులను ప్రవేశపెట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గురుకులాల్లో ఇంటర్‌ విద్య
గురుకులాల్లో ఇంటర్‌ విద్య
గురుకులాల్లో ఇంటర్‌ విద్య

ట్రెండింగ్‌

Advertisement