GT vs RCB : భారీ ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఓపెనింగ్ జోడీ మళ్లీ విఫలమైంది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(24) భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. సాయి కిశోర్ ఓవర్లో బౌండరీ వద్ద విజయ్ శంకర్ చేతికి చిక్కాడు. దాంతో, 40 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న విల్ జాక్స్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ 14 పరుగులతో ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 48/1.
ప్లే ఆఫ్ రేసులో వెనకబడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కీలక పోరులో భారీ స్కోర్ చేసింది. సొంత గడ్డపై యువకెరటం సాయి సుదర్శన్(84 నాటౌట్), చిచ్చరపిడుగు షారుఖ్ ఖాన్(58)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. 45 పరుగులకే రెండు వికెట్లు పడినా.. వీళ్లిద్దరూ బౌండరీలతో చెలరేగారు. చివర్లో డేవిడ్ మిల్లర్(26 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 రన్స్ కొట్టింది.