వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

- కలెక్టర్ శర్మన్
- పీహెచ్‌సీల్లో ఆకస్మిక తనిఖీ
వెల్దండ జనవరి 15: కొవిడ్-19 వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపటాల్టని కలెక్టర్ శర్మన్ అన్నారు. శుక్రవారం వెల్దండ పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రోగుల వివరాలను తెలసుకుని వైద్య సేవలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేయాలని, విధుల్లో అలసత్వం వహించరాదన్నారు. గురువారం జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్ వెల్దండ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ తిలక్ సిబ్బంది ఉన్నారు.
తిమ్మాజిపేట పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్
తిమ్మాజిపేట, జనవరి 15: తిమ్మాజిపేట పీహెచ్‌సీని కలెక్టర్ శర్మన్ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు.శనివారం నుంచి కొవిడ్ వాక్సిన్ వేస్తున్న దృష్ట్యా పీహెచ్సీలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వాక్సినేటర్లతో మాట్లాడారు. వ్యా క్సిన్ గదిని పరిశీలించారు. దవాఖానను శుభ్రం చేయాల్సిందిగా సర్పంచ్ వేణుగొపాల్గౌడ్ను ఆదేశించారు.శనివారం ఉదయం తిమ్మాజిపేటలోనే వాక్సిన్ను ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీకావేసే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, టీకా కోసం వచ్చేవారి వివరాలన్నీ సమోదు చేయాలన్నారు.టీకా అనంతరం ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స అందించాలన్నారు. ఆయన వెంట డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్లాల్, తాసిల్దార్ సరస్వతి, వైద్యులు మంజులవాణి, సూపర్వైజర్లు సురేందర్‌రెడ్డి, గౌస్, సునాధ, ఫార్మసిస్ట్ బాల్‌రాజ్ తదితరులు ఉన్నారు.
కల్వకుర్తికి చేరుకున్న వ్యాక్సిన్
కల్వకుర్తి, జనవరి 15:కొవిడ్ వ్యాక్సిన్ శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. 15 నుంచి కరోనా వారియర్స్‌గా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడంలో భాగంగా వ్యాక్సిన్ కల్వకుర్తి దవాఖానలో భద్రపరిచారు. ఏర్పాట్లను కలెక్టర్ శర్మన్తోపాటు డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్లాల్ పరిశీలించారు.
జిల్లాకు చేరిన కొవిడ్ వ్యాక్సిన్
బిజినేపల్లి, జనవరి 15 : మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి బుధవారం రాత్రి కొవిడ్ వ్యాక్సిన్ చేరినట్లు జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్‌వో సుధాకర్లాల్ తెలిపారు. మొత్తం 250 డోసులు వచ్చాయన్నారు. ఈ వ్యాక్సిన్ కార్యాలయంలోని కోల్డ్‌స్టోరేజ్‌లో భద్రపర్చినట్లు తెలిపారు. 32 కేంద్రాల్లో మొదటి విడుతగా డాక్టర్లకు, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.
తిమ్మాజిపేటలో తొలి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు
తిమ్మాజిపేట,జనవరి 15: కొవిడ్ నివారణ వాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. జిల్లాలో మొదటి వాక్సిన్ తిమ్మాజిపేట దవాఖానలో వేయనున్నట్లు శనివారం వాక్సిన్ వేసేందుకు మండల కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 16 వాయిల్స్ వాక్సిన్ తిమ్మాజిపేట వచ్చింది. ఈ వాయిల్స్‌తో 160 మందికి మొదటి డోసు వేయనున్నారు. గురు, శుక్రవారాల్లో మండ ల కేంద్రంలోని ప్రాథమిక దవాఖానల్లో అదనపు కలెక్టర్ హనునంత్రెడ్డి, డీంఅండ్హెచ్వో సుధాకర్లాల్, అదనపు వైద్యాధికారి వెంకటదాసు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు కొవిడ్ వాక్సిన్ వేసేందుకు స్థానిక దవాఖానలో నాలుగు దశలు ఏర్పాటు చేశారు. మొదట దవాఖాన వైద్యులు, సిబ్బందికి, అనంతరం పారిశుధ్యకార్మికులకు, అంగన్వాడీ సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు వ్యాక్సిన్ వేయనున్నారు.
తాజావార్తలు
- జహీరాబాద్ అభివృద్ధిపై మంత్రి హరీశ్ సమీక్ష
- జనగామ జిల్లాలో సర్పంచ్ సస్పెండ్, మరొకరికి షోకాజ్ నోటీసులు
- సంగారెడ్డిలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు
- సమన్వయంతో పనిచేస్తే పన్నుల వసూళ్లలో పురోగతి
- ప్రసవం తర్వాత కుంకుమ పువ్వు తినడం మంచిదేనా?
- మార్చి 2 నుంచి ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల