గురువారం 22 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 19, 2020 , 02:32:42

రెవె‘న్యూ’ చట్టంతో రైతన్నకు మేలు

రెవె‘న్యూ’ చట్టంతో రైతన్నకు మేలు

  • ఈ ఏడాది 39శాతం పెరిగిన సాగు 
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  •  గత పాలనలో రైతన్నకు   భారంగా  మారిన వ్యవసాయం
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • అట్టహాసంగా దేవరకద్ర మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

దేవరకద్ర రూరల్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ చట్టం రైతులకు మేలు చేకూరే విధంగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌ నూతన కమిటీ అధ్యక్షురాలిగా కొండ సుగుణశ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా మం త్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడా ది పుష్కలంగా వర్షాలు పడటంతో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతుతన్నాయన్నారు. రాష్ట్రంలో గతేడాది కన్నా ఈ ఏడాది పంటసాగు పెరిగిందన్నారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూరాలనే ప్రతి 5వేల ఎకరాలకు రైతు వేదిక భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ గత పాలకుల పాలనలో వ్యవసాయం కుదించుకుపోయిందన్నారు. 70ఏండ్ల పాలనలో ఒక్క చెరువు కూడా నిర్మాణం కానీ, మరమ్మతులు కానీ చేసిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ ప్ర భుత్వం వచ్చాక ప్రతి చెరువును బాగు చేయడం ద్వా రా, ఈ ఏడాది చెరువులు కళకళలాడుతున్నాయని అ న్నారు.

రైతులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ సార్‌ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ మార్కెట్‌లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజలకు రైతాంగానికి లబ్ధి చేకూరేందుకు కృషి చేస్తామన్నారు. మార్కెట్‌ ఆవరణలో ఉన్న స్థలంలో దుకాణ సముదాయం నిర్మాణానికి, శీతల గిడ్డంగి మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రులను కోరగా పరిశీలించి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లను ప్రమాణం చేయించారు. వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎంపీపీ రమాశ్రీకాంత్‌యాదవ్‌, జెడ్పీటీసీ అ న్నపూర్ణ, వైస్‌ ఎంపీపీ సుజాత, మార్కెటింగ్‌ శాఖ డి ప్యూటీ డైరెక్టర్‌ పద్మహర్ష, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు కొండ శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo