శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 02, 2020 , 00:27:30

సన్నద్ధం

సన్నద్ధం

కందనూలు: ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈ నెల 4నుంచి ప్రారంభంకానున్నాయి. అధ్యాపకులు విద్యార్థులను ఏడాది కాలంగా సన్నద్ధం చేయడానికి తీసుకున్న సయమం పూర్తికావచ్చింది. ఇంటర్‌ పరీక్షలకు పటిష్టమైనా ఏర్పాట్లతో కట్టుదిట్టమైనా భద్రతతో జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారో అనే విషయమై అటు తల్లిదండ్రుల్లో, ఇటు అధ్యాపకులలో, విద్యార్థులలో ఉత్కంఠ మొదలైంది.

4నుంచి 29 వరకు పరీక్షలు

ఇంటర్‌ పరీక్షలు ఈనెల 4నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి వెంకటరమణ తెలిపారు. పరీక్షలకు అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఇన్విజిలేటర్లు ఉదయం 8గంటల నుంచే కేంద్రాలలోనికి అనుమతించి, మధ్యాహ్నం 12 గంటలకు బయటికి పంపిస్తారని సూచించారు. 3గంటల పాటు రాసే పరీక్షకు విద్యార్థులకు సమయం తెలియడానికి గంటకోసారి బెల్‌ కొడతారని విదార్థులు బెల్‌ని అనుసరించి పరీక్షలు రాయాలన్నారు. మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఫ్లైయింగ్‌స్కాడ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలు కేంద్రాల చుట్టూ తిరుగుతుంటారని విద్యార్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడితెనా డిబార్‌ చేస్తారని సూచించారు.

13,748 మంది విద్యార్థులు 

ఈ విద్యాసంవత్సరం 13,748 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారని జిల్లా నోడల్‌ అధికారి తెలిపారు. జిల్లాలో మొత్తం 29 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశామని 11స్టోరేజ్‌ పాయింట్లను, 2 ప్లాయింగ్‌ స్కాడ్‌లను, 2సిట్టింగ్‌ స్కాడ్‌ల బృందాలను, 29 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌, 29మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించినట్లు వారు తెలిపారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తుపట్టేందుకు యాప్‌లను తయారు చేశామని, కంట్రోల్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. 

కేంద్రాల వద్ద 144సెక్షన్‌ 

పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉంటుందని నోడల్‌ అధికారి అన్నారు. కావున అభ్యర్థులుగాని,వారికి సంబంధించిన వారు కాని ఎలాంటి అవకతవకలు పాల్పడినా వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్‌ సెంటర్లు తమ దుకాణాలు తెరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సూచించారు. 

అమలులో ‘నిమిషం’ నిబంధన

పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు 9గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. కావున విద్యార్థులు అర్ధగంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకోకుండా రావాలని వారు సూచించారు.

సీసీ నిఘాలో..

ఇంటర్‌ పరీక్షలు సీసీ పుటేజీ పర్యవేక్షణలో జరుగనున్నాయి. విద్యార్థులు పరీక్షలను ఆత్మైస్థెర్యంతో రాయాలని కేంద్రంలో ఏవైనా అనుచిత సంఘటనలు జరిగితే ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేయాలి. నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తి చేయాలి. సమయం పూర్తి అయిన తర్వాతే తమ సమాధాన పత్రాలు ఇచ్చి కేంద్రాల నుంచి బయటికి వెళ్లాలని మధ్యలో ఎవరూ అలా వెళ్లకూడదని తెలిపారు.

- వెంకటరమణ,జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి


logo