శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Feb 27, 2020 , 03:58:37

ఆడబిడ్డలే అందరికీ ఆధారం

ఆడబిడ్డలే అందరికీ ఆధారం

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: ఆడబిడ్డలే సృష్టికి, మనిషి మనుగడకు ఆధారమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాల 47వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మేరకు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడపిల్ల ఎదుగుతుంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషంగా ఒక వైపు ఉన్నా.. మరోవైపు మాత్రం గుండెల్లో గుబులు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేయడంతో ఎంతో ధైర్యాన్నిస్తుందని తెలిపారు. కేవలం 5ఏండ్లు శ్రద్ధ వహించి కష్టపడి చదివితే మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారాని తెలియజేశారు. విద్యార్థినులు సినిమాలు, సీరియళ్లు చూడకుండా చదువుపై శ్రద్ధ వహించాలని తెలిపారు. మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తూ మిమిల్ని చదివిపిస్తున్నారని, వారి నమ్మకాలను వమ్ము చేయకుండా కలలను నిజం చేయాలని సూచించారు. మంచిగా చదివిన వారికి నేను ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన మీ అన్న మంత్రిగా ఉన్నాడని చెప్పండని తెలియజేశారు. కళాశాలలో బాత్‌రూం, టాయిలెట్స్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతులు, మెమోటోలను అందజేశారు. 

మీ కోసం మీరు చదవండి

కాలయాపన చేసి తీరా సమయం వృథా చేయకుండా మీ కోసం మీరు చదవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాలలో 51 వార్షికోత్సవంలో మంత్రి హాజరై మాట్లాడారు. ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేశారు. బాలుర కళాశాల ముందున్న ప్రధాన రోడ్డు రాత్రి సమయంలో విద్యుత్‌కాంతులతో వెలిగిపోతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, కౌన్సిలర్‌ రాంలక్ష్మణ్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.


logo