IPL 2024 | ప్లే ఆఫ్స్ బరిలో ఆ నాలుగు.. ఆర్సీబీకీ చాన్స్ ఉందా..?
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. నెల రోజులకు పైగా ఆభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరో రెండు వారాల్లో ముగియనుంది. దాంతో, ప్లే ఆఫ్స్ (IPL Play Offs) రేసు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. నెల రోజులకు పైగా ఆభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరో రెండు వారాల్లో ముగియనుంది. దాంతో, ప్లే ఆఫ్స్ (IPL Play Offs) రేసు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే టేబుల్ టాపర్స్ కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు 16 పాయింట్లతో బెర్తులు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కీలక పోరులో గర్జించింది. సొంతగడ్డపై ఓపెనర్లు ట్రావిస్ హెడ్(89 నాటౌట్), అభిషేక్ శర్మ(75 నాటౌట్) ల విధ్వంసంతో క్నో సూపర్ జెయింట్స్పై భారీ విజయం మూటగట్టుకుంది. రికార్డు విజయం సాధించిన కమిన్స్ సేన 14 పాయింట్లతో రేసులోకి దూసుకురాగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సైతం పోటీలోనే ఉన్నాయి.
A stylish strike to end a stylish chase!
Simply special from the #SRH openers 🤝
Recap the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvLSG pic.twitter.com/2xUlOlS1kk
— IndianPremierLeague (@IPL) May 8, 2024
భారీ తేడాతో గెలిస్తేనే..
ప్రస్తుతం చెన్నై, ఢిల్లీ, లక్నో జట్లు 12 పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. అయితే.. రుతురాజ్ గైక్వాడ్ బృందానికి ఇంకా మూడు మ్యాచ్లు ఉండగా.. ఢిల్లీ, లక్నోకు రెండు మ్యాచ్లు ఉన్నాయంతే. దాంతో, అవి భారీ తేడాతో ఈ రెండింటా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ సైతం తర్వాతి రెండు మ్యాచుల్లో గుజరాత్, పంజాబ్పై గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. అదే జరిగితే.. ఢిల్లీ, లక్నోకు చాన్స్ ఉండకపోవచ్చు.

ఆ జట్లు ఓడిపోతేనే..
ఇక ఈసారి కూడా పడుతూ లేస్తూ సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి అవకాశం దాదాపు లేనట్టే. ప్రస్తుతం ఆ జట్టు రన్ రేటే -0.09, ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 16 ఏండ్లలో ఒక్క ట్రోఫీ నెగ్గని ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగతా మూడు మ్యాచులు కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అంతేకాదు చెన్నై, లక్నో, ఢిల్లీ జట్లు తర్వాతి మ్యాచుల్లో ఓడిపోతే బెంగళూరు ముందుకు వెళ్తుంది. కానీ, అది జరుగుతుందా? లేదా? అనేది చెప్పలేం.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

