బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 10, 2020 , 00:41:03

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి

బిజినేపల్లి : గత మూడు రోజులుగా వేసిన నామినేషన్లను పరిశీలించడం జరిగిందని ఎన్నికల అధికారి సుబ్బరాజు తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 35 గ్రామాలకు 24 రెవెన్యూ గ్రామాలు ఉండగా 13 డైరెక్టర్లుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  మొత్తం 55 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. వేసిన నామినేషన్లు అన్ని చెల్లుబాటయినట్లు తెలిపారు. 

బరిలో 61 మంది అభ్యర్థులు

తాడూరు : మండల సహకార ఎన్నికల్లో 24 గ్రామాల్లోని 13 డైరెక్టర్లకు  61 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారి పీ శ్రీలత తెలిపారు. మొత్తం 61 మంది నామినేషన్లు వే య గా  అందరూ బరిలో ఉన్నట్లు తెలిపారు. సోమవారం విత్‌డ్రా ఉంటుందని, సాయంత్రం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామన్నారు.  నామినేషన్‌ వేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగ్గా విండో కార్యాలయానికి రావాలని కోరారు. 

ఒక నామినేషన్‌ తిరస్కరణ

తిమ్మాజిపేట/తెలకపల్లి  :  స్థానిక విండో కార్యాలయంలో ఎన్నికల అధికారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో నామినేషన్లు పరిశీలించారు.  మొత్తం 43 నామినేషన్లు 11వ డైరెక్టర్‌ స్థానానికి దాఖలు చే సిన ఒక నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి , సీఈవో నరేశ్‌లు తెలిపారు. 3వ వార్డు కోసం దాఖలు చేసిన రెండు నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ మద్దతుతో నామినేషన్‌ వేసిన ఆవంచకు చెందిన నరేందర్‌రెడ్డి ఒక్కరే బరిలో ఉన్నట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు.దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలకపల్లిలో మొత్తం 13 స్థానాలకు 43మంది నామినేషన్లు వేశారు. ఎవరి నా మినేషన్‌ కూడా తిరస్కరించలేదని, ఎలాంటి తప్పులు లేకపోవడంతో అన్నింటిని ఆమోదించినట్లు  అధికారులు తెలిపారు.  


logo