శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 22, 2021 , 00:15:26

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌ : ఇద్దరికి గాయాలు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌ : ఇద్దరికి గాయాలు

చిలుపూర్‌, జనవరి 21 : హైదరాబాద్‌-వరంగల్‌ హైవేపై మండలంలోని నష్కల్‌ బస్‌స్టాప్‌ వద్ద గురువారం ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొంది. ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.. ఐనవోలుకు వెళ్లి వస్తున్న హన్మకొండ డిపో బస్సును వేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొనడంతో బస్సు వెనుకభాగం దెబ్బతిన్నది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో పాశం ఆనందం, ఎండీ యాకూబ్‌కు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. బాధితులను చికిత్స కోసం దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు.


VIDEOS

logo