గురువారం 03 డిసెంబర్ 2020
Mulugu - Nov 22, 2020 , 01:37:47

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ములుగు కలెక్టరేట్‌: మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబాలకు ప్రభు త్వం నుంచి రూ.3లక్షల చొప్పున మంజూరు కాగా, శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి వారికి అందజేశారు. తాడ్వాయి గ్రామానికి చెందిన ఊకె సమ్మక్క, ఏటూరునాగారం గ్రామానికి చెందిన బొల్లె జీవన్‌జ్యోతి, ఫర్జానా, మంగపేట గ్రామానికి చెందిన ఎం.శైలజకు మంజూరైన చెక్కులను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే రమాదేవి, కలెక్టరేట్‌ ఏవో శ్యామ్‌కుమార్‌ పాల్గొన్నారు.