శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:18:33

జీవితంలో ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం

జీవితంలో ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం
  • -జెడ్పీచైర్మన్‌ జగదీశ్వర్‌


ఏటూరునాగారం, జనవరి11: ఎన్ని రోజు లు బతికామన్నది కాదు.. ప్రజలకు ఎంత చేసే చేశామన్నదే ముఖ్యమని జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. మండలకేంద్రంలోని బన్ను దవాఖానలో ఏర్పాటు చేసిన స్కానింగ్‌ మిషన్‌ను శనివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ  ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని సమయంలో బన్ను దవాఖాన యాజమాన్యం  తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం అభినందనీయమన్నారు.  ఆస్పత్రి యజమాన్యం ఏజెన్సీ వాసులకు చేసే సేవలకు తన వంతు సాయం అందిస్తానని తెలిపా రు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌  బడే నాగజ్యోతి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ,  మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, కన్నాయిగూడెం జెడ్పీటీసీ చందు గాంధీ, సర్పంచ్‌ ఈసం రామ్మూ ర్తి, పల్లా బుచ్చయ్య, వైద్యులు చంద్రజిత్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, భరత్‌రెడ్డి, నిర్మల, నాయకులు సునీల్‌, మాల్లారెడ్డి,   అజ్మత్‌ఖాన్‌, భరత్‌, నూతి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


logo