e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి సమస్యలు వెంటనే పరిష్కరించాలి

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

సమస్యలు వెంటనే పరిష్కరించాలి
 • అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి
 • కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌

కుత్బుల్లాపూర్‌,జూలై 17: ‘పట్టణ ప్రగతి’లో వెలువడిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అధికారులకు సూచించారు. శనివారం కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల అధికారులు, కార్పొరేటర్లతో సర్కిల్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోనల్‌ కమిషనర్‌ మమత అధ్యక్షత వహించగా ఉప కమిషనర్లు మంగతాయారు, రవీందర్‌కుమార్‌తో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పది రోజుల పాటు చేపట్టిన పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలపై చర్చించారు. జంట సర్కిళ్ల పరిధిలో పట్టణ ప్రగతి ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ తరుణంలో సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి, పకడ్బందీగా పరిష్కరించాలని పలు సందేశాలు, సలహాలను అందించారు. అనంతరం కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పలు అంశాలను సంబంధిత అధికారులతో చర్చించారు.

నిధులకు బేఫికర్‌..

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు సైనికుల్లా పని చేయాలి. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను తీసుకొచ్చే బాధ్యత నాది. పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ సహకారంతో నిధుల మంజూరికి ఏమాత్రం డోకా లేదు. ప్రణాళికల మేరకు త్వరలోనే నిధులను తెప్పించుకొని సమస్యల పరిష్కారం దిశగా పని చేద్దాం.. అధికారులంతా కలిసిగట్టుగా సమన్వయంతో ముందుకు సాగాలి. బాధ్యతతో పని చేస్తే చిరకాలం ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. – కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్‌

గుర్తించిన సమస్యలు..

 • పట్టణ ప్రగతి ద్వారా కుత్బుల్లాపూర్‌-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు వెళ్లడించారు.
 • కొత్తగా ఏర్పడిన కాలనీలు, మిగిలిన బస్తీల్లో 164 చోట్ల తాగునీటి పైపులైన్ల ఏర్పాటును గుర్తించి, వాటిలో 21 చోట్ల వెంటనే పనులు పూర్తి చేశామన్నారు.
 • మిగిలి వాటికి సుమారు రూ.9 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని వాటర్‌ వర్క్స్‌ అధికారులు తెలిపారు.
 • గాజులరామారం, జగద్గీరిగుట్ట, కుత్బుల్లాపూర్‌ డివిజన్లలో దెబ్బతిన్న 125 స్తంభాలు, కొత్తగా 84 మధ్య స్తంభాలు ఏర్పాటు, మరమ్మతులను గుర్తించామని, వాటి ఏర్పాటుకు రూ.10 లక్షల వ్యయప్రణాళికలు వేశారు.
 • 13 దెబ్బతిన్న స్తంభాలు, 19 వంగిన స్తంభాలు, 7 కొత్తగా అవసరమయ్యే స్తంభాలు, 19 మార్చాల్సిన స్తంభాలను గుర్తించామని, వాటి ఏర్పాటుకు రూ. 21.7 లక్షల వ్యయప్రణాళికలను రూపొందించారు.
 • సుభాష్‌నగర్‌, జీడిమెట్ల డివిజన్‌లలో 5 వంగిన స్తంభాలు, 2 దెబ్బతిన్న స్తంభాలు, 15 కొత్తగా అవసరమయ్యే స్తంభాలు, 3 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, 22 వదులుగా ఉన్న లైన్లు గుర్తించగా వాటి పరిష్కారానికి రూ.16 లక్షల వ్యయప్రణాళికలను రూపొందించారు.
 • సర్కిల్‌ పరిధిలో నాలుగు డివిజన్లలో 80 చోట్ల భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు, 75 చోట్ల సీసీరోడ్ల ఏర్పాటు, 28 బ్రిడ్జీలు, పార్కులు, ఓపెన్‌జిమ్‌ల ఏర్పాటుకు రూ.16.50 కోట్ల వ్యయప్రణాళికలు
 • సర్కిల్‌ పరిధిలో నాలుగు డివిజన్లలో 36 చోట్ల భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు, 61 చోట్ల సీసీరోడ్లు, 16చోట్ల వర్షపు నీటి నాలాలు,
 • పార్కుల అభివృద్ధి, ప్రహరీలు, శ్మశానవాటికల అభివృద్ధి పనులు గుర్తించామని, మరో 41 చోట్ల మెయింటనెన్స్‌ పనుల కోసం రూ. 41.76 కోట్ల వ్యయప్రణాళికలు అధికారులు రూపొందించారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమస్యలు వెంటనే పరిష్కరించాలి
సమస్యలు వెంటనే పరిష్కరించాలి
సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ట్రెండింగ్‌

Advertisement