e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ఆదుకుంటున్న‘సీఎం సహాయనిధి’

ఆదుకుంటున్న‘సీఎం సహాయనిధి’

కీసర, అక్టోబర్‌ 18 : అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన వన్నీగూడకు చెందిన రాగుల ప్రమీల వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం లబ్ధిదారురాలికి మంజూరైన చెక్కును మంత్రి తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు. అనారోగ్య సమయంలో నిరుపేదలను సీఎం సహాయనిధి ఆదుకుంటున్నదని తెలిపారు. దరఖాస్తు చేసుకొన్న అర్హులైన వారందరికి ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆదుకుంటున్నదన్నారు. మండలాల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ ఆండాలుమల్లేశ్‌, నాయకులు వెంకటేశ్‌ ముదిరాజ్‌, మల్లేశ్‌, బాల్‌రాజ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

వెంకటాపూర్‌కు చెందిన ఇద్దరికి..

ఘట్‌కేసర్‌ రూరల్‌ : పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరమని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఆండాలు, జంగయ్య వైద్య సహాయనిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎంపీపీ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రామారావు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నాగులపల్లి రమేశ్‌ , ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ రెడ్డి, నాయకులు బస్వరాజ్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఆంజనేయులు, దామోదర్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement