శనివారం 05 డిసెంబర్ 2020
Medchal - Aug 19, 2020 , 00:27:33

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

శామీర్‌పేట : నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మూడుచింతలపల్లి మండలం ఆద్రాస్‌పల్లి గ్రామంలో మంగళవారం 6వ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోట విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.  అనంతరం పంచాయతీకి నూతన భవనం మంజూరు చేయాలని సర్పంచ్‌ లలితనర్సింహులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికామురళీగౌడ్‌, ఎంపీటీసీ హనుమంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ జహంగీర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.