మంగళవారం 09 మార్చి 2021
Medchal - Jan 28, 2021 , 03:42:19

యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి

యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి

బోడుప్పల్‌, జనవరి 27 : కరోనా ఏడాది కాలంగా ప్రజలు ఇండ్లకే పరిమితమై క్రీడలకు దూరమయ్యారని, ముఖ్యంగా యువత క్రీడలపై దృష్టి సారించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం ఏర్పడి ఏడాది కాలం పూర్తిచేసున్న సందర్భంగా బోడుప్పల్‌ బృందావన్‌ కాలనీ గ్రౌండ్‌లో 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ బందారం అంజలీశ్రీధర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను బుధవారం మంత్రి స్థానిక మేయర్‌ సామల బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడుతాయన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఎవరు గెలిచినా క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. టోర్నమెంట్‌ నిర్వాహకులు బందారం అంజలీశ్రీధర్‌గౌడ్‌ను మంత్రి అభినందించారు. అంతకుముందు మంత్రి క్రికెట్‌ ఆడి యువతలో క్రీడాస్ఫూర్తిని నింపారు. కార్యక్రమంలోఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, జంట కార్పొరేషన్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, దర్గ దయాకర్‌రెడ్డి, నిర్వాహకులు, స్థానిక కార్పొరేటర్లు, సింగిరెడ్డి పద్మారెడ్డి, చీరాల నర్సింహ, చందర్‌గౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు, స్థానిక నాయకులు, కాటపల్లి రాంచంద్రారెడ్డి, జడిగ రమేశ్‌, కొత్త చక్రపాణిగౌడ్‌, విప్లమ్‌రెడ్డి, పులకండ్ల కీర్తన్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

VIDEOS

logo