శనివారం 06 మార్చి 2021
Medchal - Jan 27, 2021 , 04:30:51

సమాజానికి మార్గదర్శకంగా నిలువాలి

సమాజానికి మార్గదర్శకంగా నిలువాలి

మేడ్చల్‌, జనవరి 26 : యువత తన మేధా సంపతితో నూతన ఆవిష్కరణలు సృష్టించి సమాజానికి దిశ నిర్దేశకులుగా నిలువాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.  మేడ్చల్‌ మున్సిపాలిటీలోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రోఫార్మర్‌ ప్లాంటేషన్‌ను మంగళవారం రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మట్టి లేకుండా నాణ్యమైన ఆకుకూరలు పండించే విధానానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు. 

కొత్తగా ఆలోచించినప్పుడే అందరికి ఆదర్శంగా మారుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకున్న సృజనాత్మకతను వెలికి తీసినప్పుడే ఇలాంటి ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేసి పది మందికి దారి చూపాలని సూచించారు. కార్యక్రమంలో మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ దీపికా నర్సింహా రెడ్డి, కౌన్సిలర్‌ ఉమా నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo