శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Oct 20, 2020 , 08:01:19

సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలి : మంత్రి మల్లారెడ్డి

సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలి : మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌ : సామాజిక బాధ్యతతో యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం ఘట్‌కేసర్‌ పోలీసులు, జనహిత సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌ రెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌, ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, రైతు సమితి మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు మాధవ రెడ్డి, నానావత్‌ రెడ్యా నాయక్‌, కౌన్సిలర్లు వెంకట్‌ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారి అంజనేయులు, జహంగీర్‌, సహకార సంఘం డైరక్టర్‌ ధర్మారెడ్డి, నాయకులు బొక్క ప్రభాకర్‌ రెడ్డి, రాధాకృష్ణముదిరాజ్‌, హరిశంకర్‌, జగన్మోహన్‌ రెడ్డి, కృపానిధి పాల్గొన్నారు.