సిద్దిపేట అర్బన్, జనవరి 11: మహనీయుల త్యాగం వెలకట్టలేనిదని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో గురువారం జరిగిన వడ్డె ఓబన్న 217వ జయంతిలో ఆమె పాల్గొన్నారు. ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసిన ఎంతో మంది చరిత్ర బయటకు రాలేదన్నారు. వడ్డె ఓబన్నను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారులు, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.