ఝరాసంగం, డిసెంబర్ 30: సొంతూరి ప్రజల ఆశీర్వాదంతోనే శాసనసభకు వెళ్లానని జహీరాబా ద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో రూ.20 లక్షలతో మంజూరు చేసిన షాదీఖానా నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాదీఖానా నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడితే సీడీపీ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చా రు.
ఇప్పటికే ఝరాసంగంలో పలు అభివృద్ధి పను లు చేపట్టామని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. హాస్టల్లో ఉన్న సమస్యలతో పాటు వసతిగృహం ఆవరణ బయట చెత్తను డంపు చేస్తుండడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వసతి గృహం వార్డెన్ వెంకటేశం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ఎంపీడీవోతో ఫోన్లో మాట్లాడి హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సూ చించారు.
మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను సన్మానించారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే దర్శించారు. ఆలయ ఈవో శివరుద్రప్ప ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశం, మాజీ అధ్యక్షుడు సంగమేశ్వర్, ఝరాసంగం పట్టణాధ్యక్షుడు ఎజాజ్బాబా, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్, ఆలయ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, షేక్ సోయల్, ఖలీల్, బషీర్ మియా, జహీర్సాబ్, బాబుమియా, వెంకట్‌రెడ్డి, నవాజ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కిషన్, భోజిరెడ్డి పాల్గొన్నారు.