తొగుట, ఏప్రిల్ 24 : అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. తొగుట ఎస్సై రవికాంతారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె భాస్కర్ (29) డైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం భాస్కర్ భార్య మృతి చెందింది.
అప్పటి నుంచి మనోవేదనకు గురై బాధపడుతున్నాడు. దీనికి తోడు ఇంటిపై రూ.3.25 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బులు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురై గురువారం తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. తల్లి మన్నె అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.