పుల్కల్, ఫిబ్రవరి 18: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో మంగళవారం కడుపునొప్పి భరించలేక గడ్డి మందు సేవించి యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుల్కల్ గ్రామ వాసి బోయిని నవీన్ (25) సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తీవ్రంగా కడుపునొప్పి రావడంతో భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో నవీన్ పొలానికి పిచికారి చేసే గడ్డి మందులు సేవించాడన్నారు. దీంతో అస్వస్తతకు గురైన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. మంగళవారం ఉదయం 11:30 ప్రాంతంలో చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడని ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు. మృతుడి తండ్రి బోయిని రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
మృతుడు నవీన్ రెండు నెలలుగా 108లో విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు నవీన్ అకస్మాత్తుగా మృతి చెందాడని తెలుసుకున్న మహబూబ్ నగర్ 108 సిబ్బంది రూ.10 వేలు, సంగారెడ్డి 108 సిబ్బంది రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు. నవీన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.