మెదక్ రూరల్ : శ్రీ వశిష్ట యోగ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మెదక్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు యోగ గురువు ఆకుల రవి తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్లో మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వశిష్ట యోగ కేంద్రం ఆధ్వర్యంలో రేపు జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీ అప్ ఇండియాకు చెందిన స్టేడియంలో యోగా డే నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఉదయం 6.30 గంటలకు ఈ యోగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆకుల రవి వెంట శ్రీ వశిష్ట యోగ కేంద్రం అధ్యక్షులు రాగి రమేష్, కార్యదర్శి పూన రవి, యోగా శిక్షకులు రవి, దేవేందర్ రెడ్డి, కరుణాకర్, ఇతర సభ్యులు తదితరులు ఉన్నారు.