అందోల్, జనవరి 23: తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి, కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కల్లుగీత వృత్తికి ఎంతో ప్రాధాన్యత పెరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈత చెట్ల పెంపకం, లైసెన్స్ రెన్యువల్ గడువు పెంపు, లైసెన్స్ మంజూరు సులభతరం చేయడంతో గౌడన్నలు సంతోషంగా కల్లు విక్రయాలు జరుపుకొంటున్నారన్నారు. వారి సంక్షేమానికి మరిన్ని వసతులు కల్పించనున్నారని, త్వరలో హైదరాబాద్‌లో నీరా కేఫ్ ప్రారంభం కానున్నది. నియోజకవర్గం నుంచి అక్కడికి నీరా సరఫరా కానున్నదని, తద్వారా మరింత మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు.
నియోజకవర్గ కేంద్రంలో గౌడ కమ్యూనిటీహాల్ నిర్మాణంతో పాటు పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ విగ్రహాల ఏర్పాటుకు సహకరిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, అందోల్ మాజీ ఎంపీపీ రామాగౌడ్, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు లింగాగౌడ్, వట్పల్లి రైతుబంధు అధ్యక్షుడు అశోక్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు ప్రసాద్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, మహేందర్‌గౌడ్, నాగరాజుగౌడ్, శేఖర్‌గౌడ్, యాదయ్యగౌడ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి భూమిపూజ చేయగా, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ ఆలయానికి స్థలం కేటాయించి, నిర్మాణానికి నిధులు కేటాయించాలని పలువురు గిరిజన సంఘం నాయకులు, కౌన్సిలర్ చందర్ నాయక్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.