మెదక్ రూరల్, జూన్ 6: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మరమ్మతులు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం హవేళీఘనపూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన విద్యా బోధన జరగాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులు ఆధునికతను సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. పనులు చేపట్టిన గ్రామ సమాఖ్యలతో మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచి నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. బడి మానేసిన పిల్లందరినీ బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఉపాధ్యాయులు మల్రెడ్డి, మధుసూదన్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.