సిద్దిపేట, ఫిబ్రవరి 21: మహిళల్లో గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని 15 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామంలోని మహిళలకు ఇటీవల ఉచితంగా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇచ్చామని, నేడు వారికి కుట్టు మిషన్లను ఉచితంగా ఇవ్వడం సంతోషంగా ఉన్నదన్నారు. గ్రామంలో జ్యూ ట్ బ్యాగులు తయారు చేయాలన్నారు. మహిళల ఆర్థికచేయూతకు కుట్టుమిషన్లు ఇసున్నామని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
నంగునూరు, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెం దిన కుటుంబాలను మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించి ఓదార్చారు. మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండి వెంకటయ్య ఇటీవల హత్యకు గురికావడంతో కుమారుని మరణాన్ని జీర్ణించుకోలేక రోదిస్తూ అతడి తండ్రి బండి బాలమల్లు(90) బుధవారం కుప్పకూలాడు. విష యం తెలుసుకున్న ఎమ్మె ల్యే మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మా జీ సర్పంచ్ భర్త ఎల్లంకి వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆదుకుంటామని భరోసానిచ్చారు. మండల సీనియర్ జర్నలిస్ట్ పాలమాకుల గ్రా మానికి చెందిన రిపోర్టర్ తులసీదాస్ బంధువులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెం దగా మరికొందరికి గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అసర్ల యాదగిరి తల్లి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.