తాగునీటి తిప్పలు తప్పేదెన్నడు
ఏడాదిగా తాగునీటికి అల్లాడుతున్నా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదం టూ ఖాళీ బిందెలతో జహీరాబాద్ ము న్సిపల్ కార్యాలయాన్ని హోతీ(కే) డ బుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ మహిళలు గురువారం ముట్టడించారు.
- ఖాళీ బిందెలతో జహీరాబాద్ బల్దియాను ముట్టడించిన మహిళలు
జహీరాబాద్, జూలై 2: ఏడాదిగా తాగునీటికి అల్లాడుతున్నా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదం టూ ఖాళీ బిందెలతో జహీరాబాద్ ము న్సిపల్ కార్యాలయాన్ని హోతీ(కే) డ బుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ మహిళలు గురువారం ముట్టడించారు. జహీరాబాద్ సీపీఎం ఏరియా కమి టీ సభ్యుడు మహిపాల్ ఆధ్వర్యంలో 350 మంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ ర్యాలీగా జహీరాబాద్ మున్సిపాలిటికీ తరలివచ్చి, బైఠాయించి ధర్నా చేశారు.
తాగునీటి సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్, కాలనీ మహిళలు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం కాలనీకి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
స్థానికంగా బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో మోటర్లు బిగించకపోవడంతో నీటి కోసం నానా అవస్థలకు గురికావాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో వీధిలైట్లు లేక రాత్రుల్లో ఇబ్బందులు పడుతున్నామని, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ముళ్లపొదలతో విష సర్పాలు, కీటకాలు సంచరిస్తున్నాయని, పలువురు మహిళలు వాటి బారిన పడిన సందర్భాలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ధర్నా విష యం తెలిసి మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యూనూస్ అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీలో వీధిలైట్లను ఏర్పాటు చేసేలా అధికారులకు ఆదేశిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. ధర్నాలో సీపీఎం నాయకులు సలీమొద్దీన్, నరేశ్, తిరుపతి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

