నర్సాపూర్, ఆగస్టు 23 : మెదక్ జిల్లాకేంద్రంలో బుధవా రం నిర్వహించిన ప్రగతి శంఖారావం బహిరంగసభకు వెళ్లడా నికి సీఎం కేసీఆర్ నర్సాపూర్ పట్టణం మీదుగా రోడ్డు మార్గం లో వెళ్లారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కాన్వాయి నర్సాపూర్లోకి రాగానే కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పూలు చల్లారు. కాన్యాయిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిని ఎక్కించుకొని మెదక్ బహిరం గ సభకు వెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఫ్లకార్డులు ప్రదర్శిస్త్తూ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్‌గుప్తా, అశోక్‌గౌడ్, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పటణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు హబీబ్‌ఖాన్, సత్యంగౌడ్, జగదీష్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, కృపాచారి, సూరారం నర్సింహులు, తొంట వెంకట్, గిరిజన నాయకుడు రమేశ్‌నాయక్, మైనార్టీ నాయకుడు రావూఫ్ పాల్గొన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గానికి వరాలు
ప్రగతి శంఖారావంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. కౌడిపల్లి మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తానని, నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, కౌడిపల్లిలో డిగ్రీ కళాశాల మంజూరుకు హామీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.