సెంట్రింగ్ కార్మికులకు అండగా ఉంటా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే వెయ్యి గజాల స్థలం కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
- సెంట్రింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌కు వెయ్యి గజాల స్థలం కేటాయిస్తాం
- భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా
- హామీ ఇచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు టౌన్, మే 25 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే వెయ్యి గజాల స్థలం కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలో నియోజకవర్గ స్థాయి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెంట్రింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడు తూ.. భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల పాత్ర చాలా కీలకమన్నారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పనులు చేయాలని సూచించారు. అసోసియేషన్‌కు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరడంతో,త్వరలోనే వెయ్యి గజాల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి కార్మికుడికి బీమా కల్పించేందుకు కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, అమీన్పూర్ మాజీ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, నాయకులు దశరథ్‌రెడ్డి, నర్రా భిక్షపతి, శ్రీధర్‌చారి, పృథ్వీరాజ్, రాజు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యాదగిరి, అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శ జంగయ్య, కాంట్రాక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓట్ల తొలగింపు దరఖాస్తులపై పరిమితులు.. ఫామ్-7 దుర్వినియోగం నేపథ్యంలో ఈసీ నిర్ణయం
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

