మెదక్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): మెదక్ లోక్‌సభ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేరొన్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని తెలిపారు. ఎంపీగా విజయం సాధించిన రఘునందన్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి కంగిపోకుండా ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిషారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకు కొత్త అయినా ఎంతో ప్రేమతో పెద్దఎత్తున ఓటు వేసిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటరుదేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు, గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన హరీశ్‌రావుకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ప్రతి కార్యకర్తకూ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీల ప్రభావంతో అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్తవి కావన్నారు. పదేండ్లలో తెలంగాణను దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో ముందు నిలిపిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. భవిష్యత్‌లో కోలుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.