మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26 : మున్సిపాలిటీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఇకపై జాప్యం జరగదు. సిబ్బంది నిర్లక్ష్యం, సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందని పరిస్థితులు ఉండేవి. ఇకపై అలాంటి తిప్పలు తప్పనున్నాయి. ఇటీవలే రాష్ట్ర మున్సిపల్‌శాఖ సంచాలకులు సత్యనారాయణ కొత్త విధానా న్ని అమలులోకి తెచ్చారు. దీంతో జనన, మరణ ధ్రువపత్రాల ఇన్స్టంట్ విధానం అమలులోకి రానుంది. ఇందులో తక్షణ రిజిస్ట్రేషన్, అనుమతి డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. దీంతో ప్రజలు ధ్రువపత్రాల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ రోజుల తిరబడి తిరగాల్సిన అవసరం లేదు. కేవలం 24 గంటల్లోనే ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందవచ్చు.
మున్సిపాలిటీల్లో జనన ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ, ప్రైవే ట్ దవాఖానలకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్లు ఇవ్వనున్నారు. దవాఖానలో జన్మించిన శిశువు వివరాలను నమో దు చేసిన వెంటనే తల్లిందండ్రుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులోని లింక్ ద్వారా జనన ధ్రువ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మరణ ధువపత్రం కోసం దవాఖానతో పాటు శ్మశాన వాటికల నిర్వాహకులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీలను ఇవ్వనున్నారు. దవాఖానల్లో మృతి చెందినవారి వివరాలను అక్కడి సిబ్బంది నమోదు చేసి వెంటనే కుటుంబీకుల సెల్‌ఫోన్‌కు ధువీకరణ పత్రం లింక్ వస్తుంది. దీని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మరణ ధ్రువపత్రం పొందవచ్చు.
ప్రస్తుతం ఆన్లైన్ పద్ధ్దతిలో జనన, మరణ ధ్రువపత్రాలు అందజేస్తున్నాం. ధ్రువపత్రాల జారీకి ప్రభుత్వం ఇప్పు డు కొత్త యాప్ అందుబాటులోకి తె చ్చింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా 24 గంటల్లోనే ధ్రువపత్రాలను సులువుగా పొందవచ్చు. – శ్రీహరి, మున్సిపల్ కమిషనర్ మెదక్