ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం అక్కన్నపేట మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నాడు, నేడు ప్రజల పక్షాన ఉద్యమ పార్టీ(బీఆర్ఎస్) అండగా నిలుస్తున్నదన్నారు. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కండ్లముందు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువయ్యా రని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత ప్రజారంజక మ్యానిఫెస్టో విడుదల చేశారని గుర్తుచేశారు.
అక్కన్నపేట, అక్టోబర్ 21: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ కోరారు. శనివారం మండలంలోని చిన్నగుబ్బడి, అంతకపేట, గొల్లకుంట, కేశనాయక్‌తండా, చెర్వుముందుతండా, గొల్లపల్లి, పంతుల్‌తండా, చౌడుతండా, బోదర్వాగుతండా, అక్కన్నపేట మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు, నేడు ప్రజల పక్షాన ఉద్యమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అదే స్థాయిలో బీఆర్ఎస్కు ప్రజల అండదండలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్టో ప్రజారంజకంగా ఉందన్నారు. కేసీఆర్ మాట ఇస్తే కచ్చితంగా అమలు చేసి తీరుతారని సృష్టం చేశారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు కండ్లముందు కనబడుతున్నాయన్నారు. కృతజ్ఞతాభావంగా కారు గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.
ప్రతిపక్షాల మాట లు నమ్మి ఓట్లేస్తే, ఢిల్లీలో ఉండి పాలించే పార్టీల ద్వారా మళ్లీ తెలంగాణలో అన్నింటిలో వెనుకబడుతుందన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో అక్కన్నపేటకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. డప్పుచప్పుళ్లు, మంగళహారతులు, బోనాలు, కోలాటాలుతో మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు స్వాగతం పలికారు. అంతకుముందు అంతకపేటలోని దుర్గామాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యా మంగ, మండల ఇన్చార్జిలు మ్యాకా నారాయణ, కాసర్ల అశోక్‌బాబు, లింగాల సాయన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోత్ బీలూనాయక్, రామచంద్రం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కందుల రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.