మెదక్ : మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ జాతీయ రహదారి పక్కన మాజీమంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ వద్ద కాంపౌండ్ వాల్‌ను గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ పంట పొలాలకు వెళ్లే రహదారిని మూసివేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. వందల సంవత్సరాల నుండి తాము వ్యవసాయ భూములు సాగు చేసుకుంటున్నామని, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడితే తమకు దారి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పినా పట్టించుకోకుండా కంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
షబ్బీర్ అలీపై తిరగబడిన సొంత గ్రామం ప్రజలు
పొలాలకు వెళ్లే రహదారిని ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించాడని కాంపౌండ్ వాల్ కూల్చివేసిన గ్రామస్తులు
మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసిన గ్రామస్తులు… pic.twitter.com/C5VQSeauoY
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026