కంది, మార్చి 1: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆదివారం కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి ఐఐటీలోని హెలిపాడ్, సమావేశ స్థలాన్ని పరిశీలించారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లను నిర్దేశించాలన్నారు. వీఐపీ పార్కింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, హెలిపాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ఐడీ కార్డుల పంపిణీ తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవ్‌రావు, డీఎస్పీ సత్తయ్యగౌడ్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీపీవో సాయిబాబా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కంది నుంచి శంకర్పల్లి మీదుగా వెళ్లాలని, ఆదివారం సాయంత్రం వరకు క్రషర్, మొరం వాహనాలు సంగారెడ్డిలోని అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.