గుమ్మడిదల, ఏప్రిల్ 21: ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దామని, ఈ సభతో అధికార కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టాలని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి అన్నారు. సోమవారం గుమ్మడిదలలోని చంద్రారెడ్డి గార్డెల్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆదర్శ్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభతో బీఆర్ఎస్ సత్తా ఏమిటో పాలక కాంగ్రెస్‌కు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలన్నారు. గద్దెనెక్కిన తర్వాత సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను, హామీలను మరిచారని విమర్శించారు. గుమ్మడిదల మండ లం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ 76 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని ఆదర్శ్‌రెడ్డి పేర్కొన్నారు.
గుమ్మిడిదల మండలం నుంచి సభకు శ్రేణులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, ధర్మారెడ్డి, చిమ్ముల నర్సింహారెడ్డి, గోపాల్, ఆకుల సత్యనారాయణ, సూర్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, చిమ్ముల మల్లారెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, డి.శంకర్, రాజశేఖర్, నరహరి, సాయిరెడ్డి, పద్మారెడ్డి, అమ్మగారి రవీందర్‌రెడ్డి, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, కాలకంటి రవీందర్‌రెడ్డి, సదానందరెడ్డి, మహిపాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్, ఏప్రిల్ 21: రానున్న రోజులు బీఆర్ఎస్వే అని, త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి అన్నారు. సోమవారం అమీన్పూర్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రె స్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, సీఎం రేవంత్ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటువేసి గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారని, మనమంతా కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తి వద్ద నిర్వహిం చే బీఆర్ఎస్ రజతోత్సవ సభను దండులా తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడులు బాల్‌రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశంగౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కవితా శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, విజయవెంకట్గౌడ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి వాల్ పోస్టర్‌ను మున్సిపల్ పరిధిలో బీరంగూడలో సోమవారం స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఆదర్శ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభకు కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కవితా శ్రీనివాస్‌రెడ్డి, కల్పనా ఉపేందర్ రెడ్డి, బిజిలి రాజు, నాయకులు జగదీశ్ ప్రమోద్ రెడ్డి, గోపాల్ మల్లేశ్, కాటా సునీతా రాజేశ్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.