నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 16 : ఈ ఫొటోలో కనిపిస్తున్న వారిని చూస్తుంటే ఏదో ఎన్నికల్లో ఓటు వేయడానికి క్యూలో ఆధార్ కార్డు పట్టుకుని నిలబడ్డారనుకుంటే పొరబడ్డట్టే. ఇది పోలింగ్ కేంద్రంలోని క్యూకాదు.. వాళ్లు ఓటర్లు కాదు. పండించిన కూరగాయలను సిద్దిపేటలోని మోడల్ రైతు బజార్లో విక్రయించుకునేందుకు స్థలం కేటాయించాలని టోకెన్ల కోసం క్యూలో గంటల తరబడి నిలబడి వేచిచూస్తున్న రైతులు వీరంతా. రైతుబజార్లో రైతులకు సరిపడా స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముందుచూపుతో బీజేఆర్ చౌరస్తాలో మరో ఇంటిగ్రేటెడ్ మారెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. దీంతో ఇప్పుడు మోడల్ రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవడానికి రద్దీతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.