చిన్నకోడూరు, ఏప్రిల్ 22: కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని, పాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొకజొన్న, సన్‌ఫ్లవర్, ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో అంబేదర్ సరిల్ వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ ఎండీ.సలీమ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఉసురు తీస్తున్నదన్నారు. పంట వేసినప్పటి నుంచి అమ్ముకునే వరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎరువులు కావాలంటే ధర్నా చేయాల్సి వస్తున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారులను దిబ్బందిస్తామని హెచ్చరించారు. మండలంలో మొకజొన్న, సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, నాయకులు పిన్నింటి అబ్బిరెడ్డి, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, ఉమేశ్‌చంద్ర, ములకల కుంటయ్య, కాల్వ ఎల్లయ్య, ముత్తయ్య, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, ఎండి సాధక్, గుండెల్లి వేణు, రాజశేఖర్‌రెడ్డి, రఘు, ఆనంద్ పాల్గొన్నారు.