మనోహరాబాద్, జూలై 9: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలకు శాపంగా మారిన ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలిగించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలకు సంఘీభావం తెలిపారు. ప్రజలందరూ ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ తమకొద్దని, తమ, తమ పిల్లల ప్రాణాలే ముఖ్యమని నినదించారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యం తో జరిగే ప్రాణనష్టాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మా ట్లాడుతూ 20 ఏండ్ల నుంచి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం, బూడిద ద్వారా వందలాది మంది మృతిచెంన్నారు. భూగర్భ జలాలు కలుషితమై బోర్ల నీళ్లు తాగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కంపెనీలో నెలకు ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నా అధికారులతో కుమ్మక్కై ప్రజల జీవితాలతో చెలగాటంఆడుతున్నారన్నారు. ఎన్జీవోల పేరిట ప్రజాభిప్రాయ సేకరణలో అడిషనల్ కలెక్టర్ ఎదుట ప్రై వేటు వ్యక్తుల తో తప్పుడు అభిప్రాయా లు చెప్పించారన్నారు. కం పెనీ ఎత్తివేయాలని కలెక్టర్‌కు వినతి ప త్రం ఇ చ్చామని, రెండు గ్రామాల మధ్య ప్రజాభిప్రా యం సేకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆదివారం ప్రజల పక్షాన నిరాహార దీక్ష చేస్తామన్నారు.