గజ్వేల్, మార్చి 13: సీఎం పదవి ఉంటుందో ఉడుతుందో అనే అయోమయంలో రేవంత్‌రెడ్డి ప్రస్టేషన్లో ఏమి మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదని, ఆయనకు పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
మాటలతో కాలం గడుపుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌కు కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రేవంత్‌కు లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠం చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. హామీలు అమలు చేయడం చేతకాక చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అన్నివర్గాలను సీఎం రేవంత్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఆరు గ్యారెంటీల పేరుచెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ప్రజలను మోసం చేసిందన్నారు. దేవాదుల కింద 50వేల ఎకరాల్లో వరి ఎండిపోతున్నదని, హల్దీ వాగులో నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్ పరిధిలోని కాలువల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి వంటేరు ప్రతాప్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రొటోకాల్ లేని నాయకులు అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతున్నారని, అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, నవాజ్‌మీరా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కనకయ్య, రవీందర్, పంబాల శివకుమార్, శ్రీధర్, దేవేందర్, భూపాల్‌రెడ్డి, ఖాసీం, రఘుపతిరెడ్డి. దయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.