గజ్వేల్, ఫిబ్రవరి 8: పదేండ్ల కేసీఆర్ పాలనలోనే గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థులు వరలక్ష్మి, రూప, స్వప్న, పద్మబాయిలకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ రాక ముందు గజ్వేల్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆయన వచ్చిన తర్వాత పదేండ్లలో జరిగిన అభివృద్ధ్దిని చూసి ఆలోచించి కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
కేసీఆర్ గజ్వేల్‌కు రాకపోతే ఇప్పటికీ మునపటిలాగే ఉంటుండే, ఆయన రాకతోనే నేడు వేలకోట్లతో గజ్వేల్‌లో అభివృద్ధి పనులు చేసుకున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ గజ్వేల్‌లో మంచిగా అభివృద్ధి చేస్తున్నాడని, తాను కూడా పోటీలో ఉండకుండా బీఆర్ఎస్లోకి వచ్చానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటువేస్తే అది వృథా అవుతుందని, అలాంటి తప్పు ఎవరూ చేయవద్దన్నారు. రాబోయే రెండున్నరేండ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తప్పకుండా మిగిలిన అభివృద్ధి చేసుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.