గజ్వేల్, ఏప్రిల్ 9: ఆర్టిజన్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించిందని, ప్రభుత్వం అలవెన్స్‌లు వచ్చేలా 90శాతం సమస్యలు పరిష్కారానికి కేసీఆర్ చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. గజ్వేల్‌లో రెండు రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీడీసీఎల్, జెన్కో పరిధిలో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర, ప్రచారాల్లో అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తానని చెప్పి, నేడు మాట తప్పారన్నారు. అందుకే కార్మికులు సమ్మెకు దిగారన్నారు. రైతులకు నేడు 12గంటలు కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
దీంతో పంటలు ఎండిపోతున్నాయని, పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందనారవీందర్, కౌన్సిలర్లు శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్, జేఏసీ డివిజన్ చైర్మన్ భూపతిరాజు, శ్రీధర్, ఎల్లేశ్, యాదగిరి, ఖలీల్‌పాషా, చంద్రం, స్వామి పాల్గొన్నారు.