వైభవంగా వనదుర్గామాత రథోత్సవం
అమ్మలగన్న మా యమ్మ.. ఏడుపాయల దుర్గమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మ.. అంటూ దుర్గమ్మ నామ స్మరణలతో ఏడుపాయల గుట్టలు ప్రతిధ్వనించాయి. ఏడుపాయల జాతరలోనే అత్యంత కీలక ఘట్టం రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. చివరి రోజు రథోత్సవ కార్యక్రమంలో చీకటిని సైతం లెక్కచేయకుండా వే లాది మంది భక్తులు తిలకించారు.
- ముగిసిన ఏడుపాయల జాతర
- రంగురంగుల విద్యుత్ దీపాలతో రథ అలంకరణ
- అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం
పానన్నపేట, మార్చి10 : అమ్మలగన్న మా యమ్మ.. ఏడుపాయల దుర్గమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మ.. అంటూ దుర్గమ్మ నామ స్మరణలతో ఏడుపాయల గుట్టలు ప్రతిధ్వనించాయి. ఏడుపాయల జాతరలోనే అత్యంత కీలక ఘట్టం రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. చివరి రోజు రథోత్సవ కార్యక్రమంలో చీకటిని సైతం లెక్కచేయకుండా వే లాది మంది భక్తులు తిలకించారు. వందలాది మంది భక్తులు రథాన్ని లాగారు. అనాదిగా వ స్తున్న ఆచారం ప్రకారం ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఎండోమెంట్ కార్యాలయం నుంచి డప్పుచప్పులతో వెళ్లి రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అధికారులను ఎదుర్కొని, అక్కడి నుంచి నేరుగా నాగ్సాన్పల్లి చేరుకున్నా రు. ఆనవాయితీ ప్రకారం గ్రామ పెద్దకాపును భాజాభజంత్రీలతో ఎదుర్కొని దుర్గమ్మ ఆలయం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వనదుర్గా భవానీమాత ఉత్సవ విగ్రహాన్ని ఎదుర్కొని రథం గోలి వరకు తీసుకొచ్చారు. గోలి సమీపాన రథం ఎదుట పట్టు పరిచి అన్నం వండి రాసి పోసే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 కులాలకు చెందిన పనిబాటల వాళ్లు పాల్గొ న్నారు. అనంతరం దుర్గామాతను వేనోళ్ల పొ గుడుతూ జయజయ ద్వనాలు చేస్తూ, దిక్కు లు ప్రజ్వరిల్లేలా ఏడుపాయల గుట్టలు మార్మోమోగుతుండగా రథాన్ని లాగే కార్యక్రమాన్ని రంగోలి ప్రాంతం నుంచి ప్రారంభించారు. రథోత్సవం రాజగోపురం వరకు కొనసాగింది. ఆలయ పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెదక్ డీఎస్పీ డాక్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టారు.
జాతర విజయవంతం
ఏడుపాయల్లో భారీసంఖ్యలో భక్తులు వస్తారన్న ఉద్దేశంతో ఎమ్మె ల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్, జిల్లా అధికారులు ముందస్తు చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా జాతరకు ముందు జిల్లాస్థాయి అధికారులు కలెక్టర్‌తోపాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

